ఊబర్, ఓలా క్యాబ్ సర్వీసులు బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.ఫైనాన్షియర్ల వేధింపులు, క్యాబ్ డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది . హైదరాబాదు నగరంలో ఊబర్, ఓలా సంస్థల్లో లక్షన్నరకు పైగా కార్లు తిరుగుతున్నాయని.. లక్షలు అప్పులు చేసి కార్లు కొనుక్కున్న ఎంతో మందికి ఉపాధి లభించడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.