తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు సమావేశం అయింది .ఈ సమావేశంలో పలు అంశాల గురించి చర్చించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే అమలు చేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు తప్పనిసరిగా లబ్ధి పొందేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు.
అంతే కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో మైనార్టీలకు కనీసం 10శాతం కోటా ఉండాలని సూచించారు .మైనార్టీ వర్గానికి చెందిన యువకులకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.2లక్షల వరకు ఆర్థికసాయం చేయాలని కూడా ఆదేశించారు. ఉద్యోగ, కోర్సుల ప్రవేశ పరీక్షలను ఉర్దూ భాషలో నిర్వహించాలన్నారు.
హైదరాబాద్‌లో ముస్లింల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడ, ఐటీ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో సూచించారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో చార్మినార్‌ను, సబర్మతి తరహాలో మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మూసీ తీరం వెంట పార్కులు, డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లతో పాటు మెట్రో, నానో రైలు ఏర్పాటు చేయాలని సూచించారు.