తెలంగాణ మంత్రివర్గం నేటి మధ్యాహ్నం భేటీ కానుంది. హైదరాబాద్ నగర పరిధిలోగల ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలతో పాటు ప్రభుత్వం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపైనే కేబినేట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే, శాసనసభ, మండలిలో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలను చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు.
