తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్‌సిటీ హెచ్‌ఐసీసీలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సదస్సుఈ రోజు ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయష్‌రంజన్ మాట్లాడుతూ… తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుని కేసులు పరిష్కరిస్తున్నారు. సైబర్ కేసులు పరిష్కారించడంలో పోలీసులు ముందుంటున్నారు. ప్రజలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశంలో ప్రభుత్వం అలర్ట్‌గా ఉందని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్‌రంజన్, సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ సందీప్‌శాండిల్యా, రాచకొండ సీపీ మహేష్‌భగవత్ పాల్గొన్నారు..