బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తనకు మూడ్ వచ్చినప్పుడల్లా టీడీపీ బ్యాచ్‌ని ఓ రేంజ్లో ఆడేసుకుంటారు. తనకు వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ నేతల్ని గిల్లుతూ నిరంతరం హాట్ టాపిక్‌గా ఉంటారు. ఇకపోతే కొందరు ఆయన జగన్ పక్షపాతి అని కూడా అంటారు. అయితే తాజాగా సోము వీర్రాజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ నాడు తవ్వించిన కాల్వల వల్లే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు పంపించగలిగామని.. నాటి వైఎస్ కృషిని విస్మరింపజాలమని అన్నారు. అయితే ఒకప్పుడు పట్టిసీమ ను వ్యతిరేకించిన వాళ్ళలో వైసీపీ వారితో సోమరాజు కూడా ఉన్నారు. ఇక 2005లో వైఎస్ ఆరంభించినప్పుడు 5వేల కోట్లు అంచనాగా ఉండగా.. తార్వాత చంద్రబాబు హయాంలో అది పదహారువేల కోట్లుకు చేరిందని.. ఈ మూడేళ్ళలో అంత వ్యవం ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు.