స్టార్స్‌కి క్రేజ్ పెరిగేకొద్ది అనూహ్య ఆఫర్లు వస్తూ ఉంటాయి. అలాగే నటరుద్ర ఎన్టీఆర్‌ను ఓ బంపర్ ఆఫర్ వరించింది. ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న తారక్ జై లవ కుశ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ నట రుద్రుడితో సినిమాలు తీస్తే లాభాలు వరిస్తాయనే ఉద్దేశంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్‌కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు నిర్మాతలు. తాజాగా ఓ నిర్మాత అయితే ఏకంగా రూ.30 కోట్లు పారితోషకం ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరైనా ఆ ప్రొడ్యూసర్ తారక్‌తో కలిసి తనతో ఓ సినిమా చేయమని అడిగాడట. అందుకు తాను రూ.30 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తానని. డేట్స్ ఇవ్వమంటూ రిక్వెస్ట్ చేశాడట. అయితే డబ్బులపై ఆసక్తి చూపని తారక్ ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం తాను చేయబోతున్న రెండు ప్రాజెక్టుల మీద తన దృష్టి ఉందని, అవి అయిపోయేంత వరకు మరే సినిమాకు కమిట్ కాకూడదని.. తాను డిసైడ్ అయినట్లు నిర్మాతలో అన్నాడు. దీంతో ఏం చేయలేక ఆ నిర్మాత తన ఆఫర్‌ని డ్రాప్ చేసుకున్నట్లు ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది. నిజానికి చేతికి అంది వచ్చిన ఆఫర్‌ని ఏ ఒక్కరు వదులుకోరు. వేరే ప్రాజెక్స్ట్‌తో బిజీగా ఉన్నా ఆ ఆఫర్‌ని హోల్డ్‌లో పెట్టి ఖాళీ అయ్యాక ఒప్పుకుంటారు. తారక్‌కి ఆ ఆప్షన్ ఉన్నప్పటికీ ఒప్పుకోక పోవడం విశేషం. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియరాలేదు. అయితే ఇండస్ర్టీలో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్ అవడం విశేషం.