బాహుబలి సినిమాతో జాతీయ స్థాయితో ఖ్యాతిని సంపాదించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సాహో ఫస్ట్ లుక్ వచ్చేసింది. అక్టోబర్ 23 సోమవారం మన డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ పేజీలో దీనిని రిలీజ్ చేశారు. విదేశీ వీధుల్లో పొగ మంచు మసకలో.. ముసుగు ధరించిన నడిచి వస్తున్న ప్రభాస్ పోస్టర్‌ను వదిలారు.
ఇక ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే హాలీవుడ్ స్థాయిలోనే దర్శకుడు సుజిత్ దీనిని రూపొందిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఐదేళ్ల తర్వాత తమ అభిమాన హీరో స్టైలిష్ లుక్కులో కనిపించటంతో డార్లింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే… పోస్టర్ పై కామెంట్లు చేస్తున్నారు. సుమారు 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌లో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.