దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ లీడర్ .ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల రాక్షసి రిచా గంగోపాధ్యాయ్ .లీడర్ తర్వాత డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ హీరోగా వచ్చిన మిర్చి ,మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన సారోచ్చారు ,మిరపకాయ్ ,విక్టరి వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి లాంటి మూవీలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది .
రిచా నటించిన చివరి సినిమా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన భాయ్ .ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు .సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ కి నెటిజన్లు మీ తర్వాత ప్రాజెక్టు ఏమిటి అంటూ ట్వీట్లు స్పందించారు .దీనికి సమాధానంగా ఆమె ఎవరైతే నా తర్వాతి సినిమా ఏంటని అడుగుతున్నారో వారందరికీ నేనిచ్చే సమాధానం ఇదే. నేను సినిమాలు వదిలేసి ఐదేళ్లు కావొస్తోంది. మీ ఫ్రెండ్ గూగుల్ ఉంది కదా. నేను ఇప్పుడు నా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. అందులో నటన అనే అంశమే లేదు అని తేల్చి
చెప్పింది ..