తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. రేవంత్ ను పదవి నుంచి తొలగించాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఈ మేరకు టీడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పొలిట్ బ్యూరో లేఖ రాసింది. టీడీపీ పార్టీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరాదంటూ లేఖలో పేర్కొంది . కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలను కూడా రేవంత్ ఇంతవరకు ఖండించలేదని… అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో టీటీడీపీ పొలిట్ బ్యూరో ఈ మేరకు తీర్మానించింది. చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసేలోగానే రేవంత్ పై వేటు పడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
