మనం వంటి క్లాసికల్ హిట్ చిత్రాన్ని, 24 వంటి విభిన్న చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటరుద్ర ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ అఖిల్ హీరోగా నటిస్తున్న హలో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఆ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు కూడా చేస్తున్నారు. అయితే, ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ కోసం స్ర్టిప్ట్‌ను రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ – విక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా అంటే.. 24 చిత్రంలా విభిన్న తరహాగా ఉంటుందా..? మనం లాగా క్లాసికల్ టచ్ ఇస్తాడా..? అనే అంశంపై ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇటీవలే జై లవ కుశతో విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన సమయాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తున్నాడు. అంతేకాదు.. మాట మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా పూర్తయ్యాకు ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా ఉండనుంది.