తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి విదితమే .శ్రీధర్ బాబు మరో వ్యక్తితో కల్సి తన ఇంట్లో గంజాయి పెట్టి కేసులో ఇరికించాలని కుట్ర పన్నినట్లు పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేశాడు .ఈ సందర్భంగా మంథని ముత్తారం మండలం ఓదేడు గ్రామ మాజీ సర్పంచ్ సుదర్శన్ ఫోన్ లో మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడిన వాయిస్ రికార్డు బయటకు వచ్చిన సంగతి కూడా తెల్సిందే .అయితే దీనిపై స్పందించిన మాజీ మంత్రి శ్రీధర్ బాబు నిజం ఒప్పుకున్నాడు .ఆయన మాట్లాడుతూ ముత్తారం మండలానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్ చేసింది నిజమే .ఆయన అక్కడ పెడతా ..ఇక్కడ పెడతా అని అన్నాడు అని శ్రీధర్ బాబు సదరు మాజీ సర్పంచ్ తో మాట్లాడిన విషయాన్నీ ఒప్పుకున్నాడు .
