Home / MOVIES / మోదీ బ్యాచ్‌ని వ‌ణికిస్తున్న మెర్స‌ల్..!

మోదీ బ్యాచ్‌ని వ‌ణికిస్తున్న మెర్స‌ల్..!

తమిళనాడులో బీజేపీ నేతలు వర్సెస్ మెర్సల్ చిత్రంగా వివాదం నడుస్తోంది. ఈ సినిమాలో జీఎస్టీతోపాటు, డిజిటల్ ఇండియా లాంటి ప్రోగ్రాంలను విమర్శించేలా డైలాగులు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు జాతీయ మీడియాలో ఎక్కడ చూసిన మెర్సల్ సినిమాకు సంబంధించి చర్చలే న‌డుస్తున్నాయి. ఈ సినిమా డైలాగులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలయ్యాయి. మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం నోట వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి. దాంతో చిత్రంలోని ఆ సన్నివేశాన్ని తొలగించాలని, లేదంటే డైలాగులని మ్యూట్ చేయాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇంతకి ఆ చిత్రంలోని ఆ డైలాగులలో అంతలా ఉన్నది ఏమిటి?

సింగపూర్ లో ప్రజలు 7% జీఎస్టీ కడుతున్నారు. వారికి ఉచితంగా మెడిసిన్స్ అందుతున్నాయి. మరి భారత ప్రభుత్వం 28% జీఎస్టీ వసూలు చేస్తూ కూడా ఉచిత వైద్య సేవలు ఎందుకు అందించాలేకపోతోంది? మెడిసిన్స్ పై 12% జీఎస్టీ కడుతున్నాం, కానీ మద్యంపై మాత్రం జీఎస్టీ లేదు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సిలండర్స్ ఉండటం లేదు. ఆక్సిజన్ సిలిండర్స్ లేకపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చే డబ్బు లేకుండాపోయిందా.. మరో గవర్నమెంట్ హాస్పిటల్‌లో వైధ్యం మధ్యలో పవర్ కట్ వలన నలుగురు చనిపోయారు. పవర్ బ్యాకప్ లేక మనుషులు చనిపోవడం సిగ్గుచేటు. ఇంకో ప్రభుత్వ హాస్పిటల్‌లో పసికందుని ఇంక్యుబెటార్‌లో ఉంచితే ఎలుక కుట్టి చనిపోయింది. ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే భయపడుతున్నారు. ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ‌ పెట్టుబడి. ఇదండీ మెర్సల్ చిత్రంలో విజయ్ చెప్పిన ఆ తమిళ డైలాగ్‌కి అనువాదం. మెడికల్ మాఫియా క‌థాంశంతో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat