కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం మెర్సెల్ చిత్రం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కారణం ఈ సినిమా అత్యంత వివాదాస్పద పంచ్ డైలాగ్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భీభత్సమైన సెటైర్స్‌తో వెండి తెర మీదకు దూసుకు రావడంతో దేశవ్యాప్తంగా మెర్సల్ తీవ్ర చర్చకు తెరలేపింది. ఇక ఆ చిత్రంలో బీజేపీకి అభ్యంతరకరమైన డైలాగ్ ఏంటంటే.. జీఎస్టీ అమలు చేస్తున్న సింగపూర్‌లో 7 శాతం వసూలు చేస్తూ వైద్యం ఉచితంగా అందిస్తుంటే.. 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న ఇండియాలో మాత్రం వైద్యం ఎందుకు ఉచితంగా అందడం లేదని హీరో ప్రశ్నలు వేస్తాడు
ఇక అంతే కాకండా అలాగే నోట్ల రద్దు , జీఎస్టీపై అనేక సెటైర్లు , పంచ్ డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నా బీజేపీ నేతలకు మాత్రం ఎక్కడో కాలెలా చేసింది. కేంద్ర కార్యక్రమాలపై అవగాహన లేకుండా సినిమా ఎలా తీశారంటూ కమలనాధులు మండిపడుతున్నారు. టైటిల్ నుంచి విడుదల వరకు అన్ని వివాదాలను భరించిన నిర్మాత మురళి.. ఇక ఈ చిత్రం విడుదల తరువాత ఇంకా ఎక్కువ అవడంతో చేతులు ఎత్తేశాడు . వివాదాస్పద సన్నివేశాలు తొలగిస్తామని, అలాగే బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టొద్దంటూ విజయ్ అభిమానులను వేడుకున్నాడు. మరి నిర్మాత తాజా నిర్ణయంతో బీజేపీ శాంతిస్తుందో లేదో చూడాలి.