దీపావళి సందర్బంగా విడుదలైన తమిళ మూవీ మెర్శల్ రిలీజ్ అయిన రోజు నుంచి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఈ మూవీ. ఈ మూవీ కి డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ వసూళ్లకైతే ఢోకా లేదు. కొన్ని కాంట్రవర్శీల వల్ల ఈ మూవీ కి మంచి పబ్లిసిటీనే వస్తుంది. మూవీ కలెక్షన్లు కూడా నిలకడగానే వస్తున్నాయి. ఈ మూవీ కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఇంకా వీకెండ్ పూర్తవ్వకముందే శనివారానికే ఈ చిత్రం వంద కోట్ల మార్కును క్రాస్ చేసింది. మెర్శల్ తో పాటుగా దీని తెలుగు వెర్షన్ కూడా విడుదల అవాల్సి ఉన్నాఅనుకోకుండా వాయిదా పడింది.
ఇక తమిళ వెర్షన్ మాత్రం అంచనాల్ని మించి వసూళ్లు సాధిస్తోంది. హీరో విజయ్ కెరీర్లో ఇది ఐదో వంద కోట్ల మూవీ కావడం విశేషం. ఇంతకుముందు తుపాకి, కత్తి, తెరి, భైరవ మూవీలు కూడా వంద కోట్ల మార్కుని దాటాయి. కత్తి మూవీ నుంచి విజయ్ నటించిన ప్రతి మూవీ వంద కోట్ల మార్కుని దాటడం విశేషం. భైరవకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ అది వంద కోట్ల వసూళ్ళని దాటింది. ఇప్పుడు మెర్శల్ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్ళని క్రాస్ చేసింది. ఇక ఈ మూవీ ఫుల్ రన్లో రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు సాధించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మెర్శల్ తెలుగు వెర్షన్ అదిరింది ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం సెన్సార్ పనులు ఆలస్యం కావడం వల్ల దీపావళికి విడుదల కాలేదు.