ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో గత కొంతకాలంగా అధికార పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సమీక్షా సమావేశం సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వారిలో దాదాపు నలబై శాతం మందికి సీట్లు ఇవ్వను అని తేల్చి చెప్పిన సంగతి విదితమే .తాజాగా ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా ఉప ముఖ్యమంత్రి కేఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు .ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కేఈ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తానూ పోటి చేయను .తన కుమారులిద్దరూ ఎన్నికలలో పోటి చేస్తారు అని ..నా నియోజక వర్గం అయిన పత్తికొండ నుండి నా రెండో కుమారుడు శ్యాం బాబు బరిలోకి దిగుతాడు అని ఆయన తెలిపారు .