తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యేకి యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే .అప్పట్లో ఈ వ్యవహారం ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని లేపింది .
తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది .అది కూడా సాక్షాత్తు ఏపీ రాష్ట్ర అధికార పార్టీ టీడీపీ కి చెందిన సీనియర్ నేత ,ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వివరించారు.ప్రముఖ న్యూస్ ఛానల్ లో నిన్న ఆదివారం ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా తొలిసారి అంటే 1978 సార్వత్రిక ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టి ఉంటారు అని అడిగిన ప్రశ్నకు కేఈ సమాధానం ఇచ్చారు .
దానికి కేఈ బదులిస్తూ అప్పట్లోనే మూడు లక్షల రూపాయల ఖర్చు అయింది .అప్పటి నుండి నేటి వరకు విలువలతో కూడిన రాజకీయాలు చేశాను .అప్పట్లో మా కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అయిన వెంటనే నాకు మంత్రి పదవి వచ్చింది ..ఆ తర్వాత ప్రముఖ హీరో దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హాయంలో టీడీపీ తరపున గెలిచిన వెంటనే మంత్రి పదవి వచ్చింది అని ఆయన తెలిపారు .