లావణ్య త్రిపాఠి ఒక రూపదర్శి మరియు సినీ నటి. తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది. అయితే, చిన్న సినిమాలతో మొదలుపెట్టి మీడియం రేంజ్ హీరోయిన్‌గా ఎదిగిన లావణ్య త్రిపాఠి ఇకపై స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవ్వాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. అందులో భాగంగానే తన స్ట్రాటజీలో భాగంగా క్రమంగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ ఫేం అయిన ఈ అందాల భామ టాప్ లిస్టులో చేరిపోయింది కూడా. సొగ్గాడే చిన్ని నాయనా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్ వంటి చిత్రాల్లో నటించిన ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. వెంట వెంటనే సినిమా చేస్తూ బిజీగా .బిజీగా గడుపుతోంది లావణ్య త్రిపాఠి.
అయితే, తాజాగా ఓ సంచలన విషయాన్ని ప్రకటించింది లావణ్య త్రిపాఠి. అదేందంటే.. తాను కూడా బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపింది. ఫుడ్ బిజినెస్ మీద .. ఫిట్ నెస్ బిజినెస్ మీద మంచి అవగాహన ఉందని అంది. అందువలన ఈ రెండు విభాగాలలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పింది. ఈ విషయంలో తనకి ఒక స్పష్టత వచ్చిన తరువాత, ఎప్పుడు .. ఎక్కడ అనేది చెబుతానని అంది.
కొంతమంది కథానాయికలు మినహా మిగతా కథానాయికల కెరియర్ తక్కువ కాలంలోనే ముగిసిపోతుంటుంది. అందువలన వలన వాళ్లు ఆ సమయంలోనే వివిధ భాషల్లో అవకాశాలను చేజిక్కించుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటూ వుంటారు. కెరియర్ మంచి జోరు మీద ఉండగానే తమకి తెలిసిన ఏదైనా బిజినెస్ ను స్టార్ట్ చేసేసి .. అవకాశాలు తగ్గిన తరువాత వ్యాపార వ్యవహారాల పైనే పూర్తి దృష్టి పెడుతుండటం అందరికి తెలిసిందే.