హీరోలు చాలామందే ఉన్నారు. అయితే అందరిలో హీరోకు కావలసిన అన్ని అర్హతలూ ఉండకపోవచ్చు. కొన్ని క్వాలిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. కొంతమంది హీరోలు నటనలో సాటిలేనివారే కావచ్చు. కానీ అంత అందంగా ఉండరు. మరికొందరికి మంచి పర్సనాలిటీ ఉండదు. కానీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అందగాడు ప్రభాస్. నేడు అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు బర్త్ డే వేడుకలని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.ప్రభాస్ అంటే చాలు ఇప్పుడు అందరికీ గుర్తుకొచ్చేది బాహుబలి. ప్రభాస్ పేరు చెప్పినా, చెప్పకపోయినా బాహుబలి అంటే చాలు. ఠక్కున గుర్తుకొచ్చేస్తాడు. మరి ఆ సినిమాతో అంతగా పాపులర్ అయ్యాడు. సినిమా పేరే ఇంటిపేరుగా చెలామణి అయిన వారున్నారు. ప్రభాస్ కూడా ఆ కేటగిరీ కిందకే వస్తాడు. బాహుబలి మూవీ ప్రభాస్ కెరీర్ లో, లైఫ్ లో నిలిచిపోయే ఒక లెజెండ్. ఆరడుగుల ఆజానుబాహువు, అందగాడు అయిన ప్రభాస్ అసలు పేరు…. వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టిన ప్రభాస్ కు సహజంగానే సినిమాలపట్ల ఇష్టం ఏర్పడింది. తండ్రి సూర్యనారాయణ రాజు సినీ నిర్మాత. పెదనాన్న కృష్ణంరాజు రెబెల్ స్టార్ . పెదనాన్న లక్షణాల్ని ప్రభాస్ పుణికిపుచ్చుకున్నాడు. కృష్ణంరాజు లాగే ప్రభాస్ కు పర్సనాలిటీ, అందం, నటన అన్నీ ఉన్నాయి.
ఈ ఆరడుగుల అందగాడు లవ్ లీ కేరక్టర్లే కాదు… వీరోచితమైన రోల్స్ కూడా పోషించాడు. హీరోల్లో ఎవరికీ రాని అదృష్టం ప్రభాస్ ను వరించింది. ఒక్క సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అయితే ఆ కీర్తి వెనక ఎంతో శ్రమ ఉంది. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ పడిన కష్టం చూస్తే …మరే హీరో కూడా అంత స్ట్రెయిన్ తీసుకోరేమో అనిపిస్తుంది. ఆ మూవీకోసం డే అండ్ నైట్ ప్రభాస్ పడిన కష్టానికి తగిన ఫలితం లభించడం విశేషం.ప్రభాస్ చేసింది తక్కువ సినిమాలే అయినా హిట్స్ ఎక్కువ. పైగా ఒక సినిమాకోసం ఒక హీరో … మరే పిక్చర్ చేయకుండా…. సంవత్సరాల తరబడి డిడికేట్ కావడం ఇంతవరకు మరే హీరో చేయలేదనే చెప్పాలి.
ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో ఫస్ట్ లుక్ విడుదల చేశారు
ప్రభాస్ బ్లాక్ కోట్ ధరించి ఒక చెయ్యి పాకెట్‌లో మరో చేతిలో ఫోన్ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది.ముఖం మాత్రం కన్పించకుండా కేవలం కళ్లు కనిపించేలా ముసుగు వేసుకున్నారు. బాహుబలి తర్వాత వస్తున్న ప్రభాస్ తొలి సినిమా సాహోనే. ఐదేళ్ల తర్వాత తమ అభిమాన హీరో స్టైలిష్ లుక్కులో కనిపించటంతో డార్లింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే… పోస్టర్ పై కామెంట్లు చేస్తున్నారు.సాహో చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా..ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.ప్రభాస్ రానున్న రోజులలో మరిన్ని మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకి అందించాలని కోరుకుందాం.