ప్రధాని నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే ఎన్నికల నోటిపికేషన్ రాకముందే అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి పావులు కదుపుతుంది బీజేపీ పార్టీ .
ఈ సందర్భంగా తమను బీజేపీ పార్టీలోకి వస్తే తనకు కోటి రూపాయలు ఇస్తామని, అడ్వాన్సుగా 10 లక్షలు ఇచ్చారని నార్త్ గుజరాత్ లో పతీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ నరేంద్ర పటేల్ తెలిపారు.గత కొంత కాలంగా రాష్ట్రంలోప్రభుత్వ కళాశాలలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఉద్యమం చేసిన హార్దిక్ పటేల్ కు నరేంద్ర పటేల్ అత్యంత సన్నిహితుడు.
హార్దిక్ కు మరో సన్నిహితుడైన వరుణ్ పటేల్ ద్వారా బీజేపీ తనకు ఈ మొత్తం ఇవ్వ జూపిందని నరేంద్ర పటేల్ చెప్పారు.కోటి రూపాయల్లో అడ్వాన్స్
గా తనకు ఇచ్చిన పది లక్షలను నరేంద్ర మీడియాకు చూపారు. వరుణ్, బీజేపీ నేతలు తనకు లంచం ఇస్తున్నారని నిరూపించడానికే ఈ డబ్బు చూపుతున్నానని ఆయన అన్నారు.