Home / MOVIES / తనకంటే 18 ఏళ్ళు పెద్దవాడైన న‌టుడితో అవికా గోర్ పెళ్లి..?

తనకంటే 18 ఏళ్ళు పెద్దవాడైన న‌టుడితో అవికా గోర్ పెళ్లి..?

బుల్లితెర పై చిన్నారి పెళ్లికూతురు ఫేం అవికా గోర్‌.. ఉయ్యాలా జంపాల చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక తన నటనతోనే కాదు అనేక మార్లు అనేక రకాల ఇష్యూస్ తో అవికా వార్తల్లో ఉంటుంది. ఈ సారి ఆమె గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త..అవికా తనకంటే 18 ఏళ్ళ‌ పెద్దవాడైన బాలీవుడ్ బుల్లితెర న‌టుడు మనీష్ రాజ్ సింఘానియాను పెళ్లి చేసుకోబోతుంద‌ని స‌మాచారం. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడితో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అవికా.. బొద్దుగా తయారయి అవకాశాలు లేకపోవడంతో లుక్ మొత్తం మార్చేసింది. అయినప్పటికీ సినిమా అవకాశాలు రాలేదు.

ఇక ఆ మధ్య టాలివుడ్ హీరో ఒకరు వేధిస్తున్నారని బాదపడి సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంది. మొన్న ఈ మద్యే ఇద్దరు స్టార్ హీరొయిన్స్ తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చింది.. ఇప్పుడేమో ఏకంగా అవికా పెళ్లి అంటూ వార్తలొస్తున్నాయి. హిందీ సీరియల్ ససురాల్ సిమర్‌కాలో న‌టిస్తున్న టైంలో అవిక‌, మనీష్ రాజ్ సింఘానియా ల మ‌ధ్యా ఎఫైర్ మొద‌లైంద‌ని బీ టౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలుగులో చాన్సులు లేక ముంబై బాట పట్టిన ఈ భామ.. మనీష్‌తో దిగిన ఫోటోలు చూసిన బాలీవుడ్ మీడియా వీరి మద్య ఎఫైర్‌ ఉందని కోడై కూసింది. ఇక ఈ వార్తలను వారిద్దరిలో ఒక్క‌రు కూడా కొట్టిపారేయకపోగా.. మా మధ్య లవ్ ఎఫైర్ ఉందని కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat