తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై అతని అనుచరులు సుదర్శన్, బార్గవ్‌పై హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు కేసునమోదు చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో మంథని నియోజకవర్గం ముత్తారం గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు జరపటంతో అసలు బాగోతం బయటపడింది. సుదర్శన్, భార్గవ్‌లను విచారించిన పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. వీరిద్దరినీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్‌బాబుతోపాటు సుదర్శన్, భార్గవ్‌పై సెక్షన్ 29 రెడ్ విత్ 20(బీ) (ii) బీ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదుచేశారు.ఈ కుట్ర కేసులో పోలీసుల ముత్తారం మండలం ఓడేడ్ లో పలువురి ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో ముత్తారం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరి కొద్దిసేపట్లో నాగరాజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
