ఒక అబద్దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు ఆడాలన్నది ఒక సామెత.ఇప్పుడు ఏపీ తెలుగుదేశం నేతల పరిస్థితి అలాగే ఉన్నట్లుగా ఉంది. మంత్రి పరిటాల సునీత ఒక అబద్దాన్ని ఎలా కవర్ చేయడానికి ప్రయత్నించారో చూడండి. మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం ఆమె మాటలు ఇలా ఉన్నాయి.ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పింది లక్షన్నర రూపాయలేనని సునీత అన్నారట. ఆదివారం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పలేదన్నారు.మంత్రిగారు ఒక సారి తమ పార్టీ ఎన్నికల మానిపెస్టో చూసుకుంటే బెటర్ కదా.అంతేకాదు. ఎన్నికల ప్రచారం నాటి చంద్రబాబు ప్రసంగాల వీడియోలను కూడా తెప్పించుకుంటే ఆమె చెప్పింది అబద్దమో, నిజమో తెలుస్తుంది కదా!
