రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ ఫస్ట్ లుక్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈ రోజున విడుదల చేసింది చిత్ర యూనిట్. నిన్న సాయంత్రం నుండి ఈ లుక్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ విడుదలైన కొద్దిసేపటికే దాన్ని టాప్ ట్రెండింగ్స్ లో నిలబెట్టారు. ఇక ఫస్ట్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా, లావిష్ గా కనిపిస్తుండంతో.. సాహోలో ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై సినిమా ప్రముఖులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.
దర్శకదిగ్గజం రాజమౌళి ‘సాహో’ ఫస్ట్ లుక్ పై స్పందించారు. కలర్స్, టెక్స్చర్స్ ను అద్భుతంగా వాడారని కితాబిచ్చారు. ‘సూపర్ స్టైలిష్ సాహో’ అంటూ ట్వీట్ చేశారు.
కలర్స్, టెక్స్చర్స్ ను అద్భుతంగా వాడారని కితాబిచ్చారు. ‘సూపర్ స్టైలిష్ సాహో’ అంటూ ట్వీట్ చేశారు. ‘సాహో’ ఫస్ట్ లుక్ పట్ల జక్కన్న చేసిన ఈ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.