హాలీవుడ్‌లో జనాలను షేక్ చేస్తున్న హార్వే వేన్ స్టీన్ అనే ప్రొడ్యూసర్ లైంగిక దాడుల ఉదంతం ఇప్పుడు బాలీవుడ్‌లోనూ కలకలం రేపుతోంది. ఎందుకంటే చాలా మంది హీరోయిన్లు దీని గురించే మాట్లాడేందుకు సిద్ధపడుతున్నారు. అయితే మనోళ్లు ఓపెన్‌గా పలాన వ్యక్తి నాకు ప్రపోజ్ చేశాడనో.. లేదంటే పలాన వ్యక్తి నన్ను బలాత్కరించాడనో. మాత్రం చెప్పట్లేదు. ఇలాంటి సెక్స్ ఆరోపణలకు ఎప్పుడూ రెడీగా ఉండే రాథికా ఆప్టే ఉంది చూశారూ.. అమ్మడు ముంబైలో జరుగుతున్న మామే ఫెస్టివల్లో ఈ అంశంపై మాట్లాడింది.
మీటు అని సాగుతన్న క్యాంపెయిన్‌కు మద్దతు ఇస్తున్నానంటూ అమ్మడు ఏం చెప్పిందంటే.. నాకెప్పుడూ అలాంటి సిట్యువేషన్ తారస పడలేదు. అలాంటి బలవంతపు సెక్స్ నేను చేయలేదు. కానీ అలాంటివి చాలా విన్నాను.. చాలా చదివాను.. అయితే బాలీవుడ్‌లో కూడా అలాంటివి ఉన్నాయంటే.. ఆశ్యర్చపోతున్నాను.. కాకపోతే ఇప్పుడు ఈ మీటు క్యాంపెయిన్ వలన చాలా మంది ఓపెన్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పింది రాథికా ఆప్టే. గతంలో సౌతిండియాలో నన్ను రూమ్‌కు రమ్మని చాలా మంది ప్రొడ్యూసర్లు బలవంతం చేశారని రాథికా ఆప్టే కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమ్మడు ఆ విషయాలను మాత్రం మామే ఫెస్టివల్‌లో చెప్పకపోవడం గమనార్హం.