ఈరోజు 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అనుష్క ప్రత్యేక బహుమతి ఇచ్చిందట.ప్రభాస్ ను సర్‌ప్రైజ్ చేసేందుకు అనుష్క స్పెషల్‌గా ప్లాన్ చేసిందట. ఒక డిజైనర్ వాచీని గిఫ్ట్‌గా పంపి అతడిని ఆశ్చర్యానికి గురిచేసిందని ‘బాలీవుడ్‌లైఫ్’ వెల్లడించింది. ప్రభాస్‌కు వాచీలంటే ఇష్టమని అందుకే అతడికి డిజైనర్ చేతిగడియారాన్ని బహుమతిగా ఇచ్చిందని తెలిపింది.
పలు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇంతకుముందు వదంతులు వచ్చాయి. వీటిని ప్రభాస్ ఖండించారు. బహుబలి 2 తర్వాత ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ప్రభాస్.. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమాలో నటిస్తున్నాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. మరోవైపు అనుష్క.. ‘భాగమతి’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం