కొట్టినా, తిట్టినా భరించింది. తాళి కట్టిన వాడు నరకం చూపిస్తున్నా మౌనంగానే ఉంది. ఏరోజుకైనా మారుతాడని భావించింది. ఓర్పుతో భరించింది. అయినా భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. భర్త తీరుతో విసుగెత్తింది. ఏమాత్రం బరించలేక పోయింది. చివరకు బుద్ది చెప్పింది.
వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో దారుణ సంఘటన జరిగింది. మండలంలోని సిరిసేడు గ్రామంలో రవీందర్(40), స్వరూపలు దంపతులు. వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. సోమవారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కోపం పట్టలేక స్వరూప తన భర్త మర్మాంగాన్ని కోసేసింది. వెంటనే బాధితుడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడ్డ అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.