తెలంగాణ ముఖ్యమంత్రి, స్వరాష్ట్ర ప్రధాత, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మరో కితాబు దక్కింది. తాజా మాజీ ఉపరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను ప్రశంసించిన సంగతి మరువక ముందే..భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పోషించనున్న పాత్రను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు.
ఒకే పార్టీ ప్రభుత్వం ఏర్పడే జమానా ముగిసిపోయిందని…2019లోకేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సదరు పత్రిక ఈ ఇంటర్వ్యూను ట్వీట్ చేసింది. దీనికి స్పందనగా ఓవైసీ రీ ట్వీట్ చేస్తూ…తెలంగాణ సీఎం కేసీఆర్ సత్తా గురించి వివరించారు.
`అల్లా దయ వల్ల 2019లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంది. కీలక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా గులాబీ దళపతికి ఆ అవకాశం దక్కుతుందని భావిస్తున్నాను“ అని ఓవైసీ ప్రశంసించారు.