ఏపీలో అప్పడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది .అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసలు వస్తోన్నారు .ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ అయిన టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న వైసీపీలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,మహిళ ఎమ్మెల్యే ఆర్కే రోజా తోడుగా మరో స్టార్ హీరోయిన్ వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది .
ఒకప్పుడు తన అందాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ జయప్రద గత పది హేండు ఏండ్లుగా యూపీలో చక్రం తిప్పారు .ఇప్పుడు ఆమె చూపు ఏపీ రాజకీయాలపై పడ్డాయి అని వార్తలు వస్తోన్నాయి .ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .
అయితే రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె వైసీపీ నుంచి రాజమండ్రి ఎంపీ సీటు అడిగితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సీటును మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు తనయుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి ఇవ్వడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా బొడ్డు ఫ్యామిలీ తిరిగి అధికార పార్టీ అయిన టీడీపీ గూటికి చేరింది .దీంతో రాజమండ్రి నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు జయప్రద బరిలోకి దిగితే ఆమెకు సీటు ఇచ్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని కూడా సమాచారం .చూడాలి మరి అమ్మడు ఎప్పుడు వైసీపీ గూటికి చేరతారో ..?