Home / MOVIES / ప‌వ‌న్ కోసం క్రిష్ క‌స‌ర‌త్తులు!

ప‌వ‌న్ కోసం క్రిష్ క‌స‌ర‌త్తులు!

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేయాల‌న్న కోరిక ప్ర‌తి ద‌ర్శ‌కుడికి ఉంటుంది. స్టార్ హీరోతో సినిమా చేయ‌డంలో ఉన్న సౌల‌భ్యం భ‌లే వేరు.అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి హీరోల క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రాస్తుంటారు ద‌ర్శ‌కులు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా అదే ప‌నిలో ఉన్నాడు. గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గద్గురం, గౌత‌మిపుత్ర ఇలా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ఓ మార్క్ సృష్టించుకున్న క్రిష్ ఇప్పుడు బాలీవుడ్‌లో మ‌ణిక‌ర్నిక రూపొందిస్తున్నారు. ఆ త‌రువాత తెలుగులో చేయ‌బోయే సినిమా కోసం ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు చేసేసుకుంటున్నారు.

అందులో భాగంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం ఓ క‌థ రాసుకునే ప‌నిలో ఉన్నారు క్రిష్‌. కంచెకంటే ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా తీయ‌డానికి శ‌త విధాలా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అది కార్య రూపం దాల్చ‌లేదు. ఈ సారి మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని త‌న క‌థ‌తో మెప్పించాల‌ని గ‌ట్టిగా డిసైడ‌య్యాడు క్రిష్‌. మ‌హేష్‌బాబు కోసం త్ర‌యం క‌థ అనే క‌థ సిద్దం చేశారు క్రిష్‌. కానీ దాన్ని ప‌ట్టాలెక్కించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. గౌత‌మిపుత్ర‌తో స్టార్ హీరోల‌ను హ్యాండిల్ చేయ‌గ‌ల‌న‌ని నిరూపించున్న క్రిష్ ఈ సారి ప‌వ‌న్ క‌ల్యాన్‌తో కాంబో సెట్ అయ్యే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్న‌ట్టే అనుకోవాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat