దక్షిణాది చిత్రసీమ నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కథానాయికల్లో తమన్నా మాత్రమే నిలదొక్కుకున్నది. గ్లామర్, అభినయంతో తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో ప్రతిభను చాటుతున్న తమన్నాకు బాహుబలి చిత్రంతో మరింత క్రేజ్ ఏర్పడింది.
. తాజాగా ఆమె విక్రమ్ ప్రధాన పాత్రలోనటిస్తున్న స్కెచ్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా విక్రమ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తి కర విషయాలను మీడియాతో పంచుకుంది తమన్నా. సినిమాల విషయంలో విక్రమ్ తీరును చూసి ఆశ్చర్య పోయానని తెలిపింది. అంతేకాకుండా.. ఆయనని అభిమానులు ఎందుకు అంతలా అభిమానిస్తారనే విషయం విక్రమ్‌తో నటిస్తున్న సమయంలో తెలుసుకున్నానని, అలాంటి విక్రమ్ తో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. విక్రమ్ ఎప్పుడూ విలక్షణమైన పాత్రలనే ఎంచుకుంటాడనీ, ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రాణం పెడతాడని అంది. ఎలాంటి వాతావరణంలోనైనా కరెక్ట్ టైమ్ కి షూటింగుకి వచ్చేస్తాడనీ, ఆయన క్రమశిక్షణ చూస్తే ఆశ్చర్యం వేస్తుందని మీడియాతో చొప్పుకొచ్చింది తమన్నా.