Home / SLIDER / ఫాం టూ ఫ్యాషన్‌లో టెక్స్‌టైల్ పార్క్ పనులు..కేటీఆర్

ఫాం టూ ఫ్యాషన్‌లో టెక్స్‌టైల్ పార్క్ పనులు..కేటీఆర్

ఫాం టూ ఫ్యాషన్ స్లోగన్‌తో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పనులు పూర్తికానున్నట్లు రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. పరిశ్రమలో పెట్టుబడులకు 22 కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హరిత కాకతీయ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు కాకతీయ ఓరుగల్లు పట్టణ ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో దేశంలోనే తెలంగాణ వస్త్ర పరిశ్రమ కేంద్రంగా మారనుందన్నారు. నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వన్ స్టాప్ షాప్‌గా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో తయారవుతున్న వివిధ రకాల వస్ర్తాలు ఇకపై వరంగల్‌లోనే తయారుకానున్నట్లు తెలిపారు. వరంగల్ టెక్స్‌టైల్ హబ్‌గా మారబోతుందని పేర్కొన్నారు. వరంగల్ గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న మహానగరమని, నిజాంల హయాంలో వస్త్ర పరిశ్రమకు వరంగల్ కేంద్రంగా ఉండేదన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీలు సీతారం నాయక్, పసునూరి రవీందర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నరేందర్, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, రెడ్యానాయక్ పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్ సమక్షంలో 22 కంపెనీలు ఎంవోయూలు చేసుకున్నాయి. పెట్టుబడులు పెట్టే ఆయా కంపెనీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
– యాంగాన్ కార్పొరేషన్ రూ. వెయ్యి కోట్లు
– వెల్స్‌వన్ గ్రూప్ రూ. 750 కోట్లు
– నందన్ డెనిమ్(చిరిపాల్ గ్రూప్) రూ. 700 కోట్లు
– అర్బక్ నిట్ ఫ్యాబ్స్ రూ. 125 కోట్లు
– శివానీ గ్రూప్ రూ. 120 కోట్లు
– గిన్నీ ఫిలమెంట్స్ రూ. 100 కోట్లు
– స్వయంవర్ గ్రూప్ రూ. 50 కోట్లు
– శ్రీనాథ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ రూ. 50 కోట్లు
– షాహీ ఎక్స్‌పోర్ట్స్ రూ. 45 కోట్లు
– సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్స్ రూ. 25 కోట్లు
– జేకాట్ ఇండ్రస్ట్రీస్ రూ. 20 కోట్లు
– జీకే థ్రెడ్స్ రూ. 15 కోట్లు
– సూర్యోదయ్ స్పిన్నింగ్‌మిల్స్ లిమిటెడ్ రూ. 10 కోట్లు
– గోకాల్డస్ ఇమేజస్ రూ. 10 కోట్ల
వీటితో పాటు పలు కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat