‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముంబయి బ్యూటీ పూజా హెగ్దే. ఆ తర్వాత ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంతో ప్రేక్షకులను మరింత మురిపించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌కి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా పూజ తన పెళ్లి, కెరీర్ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
అయితే, నేను అస్సలు బాగుండనని అనుకునేదాన్ని.. నా ఫ్రెండ్స్ మాత్రం నీలో మాంచి.. విషయం ఉంది.. మంచి హీరోయిన్ అవుతావు.. చాలా అందంగా ఉంటావ్ అనేవారు. స్కూల్ డేస్‌లో నేను టామ్ బాయ్‌లా ఉండేదాన్ని.. అందులోనూ అప్పట్లో హెయిర్ షార్ట్‌గా కత్తిరించుకునేదాన్ని. దాంతో నాకు నేను బాగున్నట్లు అనిపించేది కాదు. అందాల పోటీల్లో పాల్గొన్నప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఏర్పడటానికి కారణమంటూ మీడియాకు చెప్పుకొచ్చింది పూజా హెగ్దే.