టాలీవుడ్ లో తను చేసింది ఒక్క సినిమానే.కానీ ఆ మూవీలో అమాయకపు చూపులూ, ముద్దు ముద్దు మాటలతో యువతరాన్ని కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ .ఇంతకూ ఎవరు అని ఆలోచిస్తున్నారా ..ఆమె శాలినీ పాండే. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి మూవీలో హీరోయిన్ గా నటించి మొదటి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలుతో పాటుగా విమర్శకుల ప్రశంసలను పొందింది .తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అర్జున్ రెడ్డి భామ పలు విషయాలను వివరించింది .ఈ సందర్భంగా తనకు నటనే ప్యాషన్ అంటోన్న ఈ జబల్‌పూర్ యువరాణి… నటి అయ్యేందుకు మాత్రం చాలానే కష్టపడింది.
ఒక వైపు ఇంజినీరింగ్ చేస్తూనే మరోవైపు థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది.ఈ క్రమంలో ఇంటర్వ్యూ లో అర్జున్ రెడ్డి మూవీ లో అవకాశం వచ్చిన సమయంలో మీ నాన్నగారు ఏమన్నారు?అని అడిగితే దానికి సమాధానంగా షాలిని మాట్లాడుతూ మొదటిగా అర్జున్‌రెడ్డి సినిమా ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టింది. ఈలోగా నేను ఒక వారం రోజులు ఉండి వస్తానని ముంబయికి వెళ్లాను. ఆయన రిటర్న్ టికెట్ కూడా తీసుకున్నారు. ఈలోగానే ‘ఎప్పుడు బయలుదేరుతున్నావు. సినిమాలే వద్దు వచ్చేయ్. ఇక్కడకు వచ్చి ఐటీ జాబ్ చేసుకో’ అని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.
వస్తాను అని ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. చివరకు బాగా ఆలోచించి నాన్నకు ఓ ఈమెయిల్ పంపా. సినిమాలంటే నాకు ఇష్టం. అదేచేస్తానని. చివరకు ఆయన వెంటనే రాకపోతే.. ఇక ఎప్పటికీ ఇంటికి రావద్దన్నారు. నేను కూడా వెళ్లకూడదనుకున్నా. అలా పదిహేను రోజులు అనుకుని వెళ్లినదాన్ని దాదాపు రెండు నెలలు అక్కడే ఉండిపోయా. ఖర్చు తగ్గించుకోవడానికి ఇద్దరితో కలిసి ఒకే గదిని పంచుకున్నా. ఒక పూటే తిన్నా. బస్సులెక్కకుండా కిలోమీటర్లు నడిచివెళ్లేదాన్ని అని ఆమె తెలిపారు .