తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్త టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు .రేవంత్ రెడ్డితో పాటుగా దాదాపు మొత్తం ఇరవై ఐదు మంది నేతలు కూడా టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారు అని కూడా ప్రచారం జరుగుతుంది .
తాజాగా మరో వార్త ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాకు చెందిన ప్రముఖ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది .అదే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు .ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలవడంతో రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళతారు .ఒకవేళ రాజీనామా చేసి మరల కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలుస్తారా ..?.గెలిస్తే రేవంత్ రెడ్డికు లాభమే ..
కానీ ఓడిపోతేనే రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది అని ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .ఒకవేళ రేవంత్ రెడ్డి పార్టీ మారితే తప్పకుండ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వస్తారు .ఎందుకంటే గతంలో టీడీపీ తరపున గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేల పై కోర్టులో కేసులు వేశారు రేవంత్ .అందుకే రేవంత్ రెడ్డి తప్పకుండ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు .చూడాలి మరి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారో లేదో కాలమే చెబుతుంది .