తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి మరో ఇరవై ఐదు మందితో కల్సి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డితో పార్టీ మారేది ఇరవై ఐదు మంది కాదు అంట .
కేవలం రాష్ట్రంలో మంచిర్యాల ,ఆదిలాబాద్ ,వరంగల్ ,నల్గొండ జిల్లాల నుండే నేతలు పార్టీ మారుతున్నారు అని సమాచారం .వారిలో మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు బోడ జనార్దన్, ఆదిలాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోయం బాపూరావునిర్మల్, కొమరం భీం జిల్లాల అధ్యక్షులు శ్యామ్ సుందర్, జి.ఆనంద్ , జి.బుచ్చిలింగం, ఆనంద్, కోరిపల్లి భూషణ్ రెడ్డి, ప్రకాష్ లడ్డా తదితరులు రేవంత్ తో పాటు నడుస్తారు అని సమాచారం .
అంతే కాకుండా రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి చేరే వారంతా తదుపరి ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటును ఖరారు చేసుకున్న తరువాతనే పార్టీ మార్పుమీద ఒక నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తోంది.