కాజల్ అగర్వాల్ గత పదేండ్లుగా తన అందంతో ,అభినయంతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది .ఒకవైపు అందాలను అరబోస్తూనే మరోవైపు నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది .మొదట్లో తన కెరీర్ లో ఫ్లాప్ లున్న కానీ ఆ తర్వాత బంపర్ హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది .
తాజాగా ఈ అమ్మడు ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది .ఇంతకాలం తనను ఆదరిస్తున్న అభిమానులకు శుభవార్తను ప్రకటించింది ముద్దుగుమ్మ .అందులో భాగంగా తన అభిమానులతో డేటింగ్ కు వెళ్ళతాను ప్రకటించేసింది .
అయితే ఈ ముద్దుగుమ్మ ఒక కండిషన్ పెట్టింది .అదే ఏమిటి అంటే డేటింగ్ టైం ,ప్లేస్ తనే ప్రకటిస్తుంది అంట ..అంతే కాకుండా తనే ఒక అభిమానిని సెలెక్ట్ చేసి వాళ్లతో తానూ ఫిక్స్ చేసిన డేట్ ,ప్లేస్ లో డేటింగ్ చేయడానికి సిద్ధం అని ఆమె ప్రకటించింది .