కాజల్ అగర్వాల్ అటో కొద్ది కాలంలోనే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసిన ముద్దుగుమ్మ ..కుర్ర హీరో మొదలు మెగాస్టార్ వరకు అందరితో నటిస్తూ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది .లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ రామ్ హీరోగా వస్తోన్న ఎమ్మెల్యే మూవీలో ఈ అమ్మడు నటిస్తుంది .
ఈ మూవీ షూటింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ అడవుల్లో జరుగుతుంది .ఈ మూవీ చిత్రీకరణలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి కళ్యాణ రామ్ అండ్ హిజ్ గాళ్ ఫ్రెండ్ కాజల్ ,సింగ్ ఎ సాంగ్ అంటూ ఈ అడవుల్లో స్టెప్పులేస్తున్నారు .
నందమూరి హీరో కళ్యాణ రామ్ హీరోగా ,టాలీవుడ్ అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయం
అవుతున్నారు .సి భరత్ చౌదరి ,ఎమ్ .వి .కిరణ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆదిలాబాద్ ,నిర్మల్ ప్రాంతంలో జరుగుతుంది .శేఖర్ మాస్టర్ నేతృత్వంలో మణిశర్మ స్వరపరిచిన పాటను కళ్యాణ రామ్ ,కాజల్ పై తెరకెక్కిస్తున్నారు ..