తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు కేసునమోదు చేశారు. నగరంలో చిక్కడపల్లి పీఎస్‌లో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, అతని అనుచరులు సుదర్శన్, బార్గవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం ముత్తారం గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి అనే వ్యక్తీ పై గంజాయి ను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయించేందుకు కట్ర పన్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది.అయితే ఫోన్లో మాజీ మంత్రి శ్రీధర్ బాబు ,అతని అనుచరుడు సుదర్శన్ ఈ సంప్రదింపులు జరిగినట్లు కూడా మీడియా లో వార్తలు వస్తోన్నాయి .
సుదర్శన్‌గౌడ్, శ్రీధర్‌బాబు మధ్య జరిగిన ఆడియో సంభాషణ ఇలా సాగింది..
సుదర్శన్ గౌడ్: నమస్తే సార్.. నేను ఓడేడు మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతున్నా..
శ్రీధర్‌బాబు: ఆ.. చెప్పు సుదర్శన్..
సుదర్శన్‌గౌడ్: కిషన్‌రెడ్డిని గంజాయి విషయంలో దొరకబట్టుదామని ప్లాన్ చేస్తున్నా..
శ్రీధర్‌బాబు: ఓకే..
సుదర్శన్‌గౌడ్: ఆ విషయంలో దుగ్గల్‌కు ప్లాన్ చెప్తే.. అక్కడకిపోయి వేరేవాళ్లతో పెట్టిస్తా..
శ్రీధర్ బాబు: ఎప్పుడు పెడతవో చెప్పు.. దుగ్గల్‌కు చెప్పినా లాభం ఉండదు. హైదరాబాద్‌లో చెప్పిస్తా.. ఒకరోజు ముందు చెప్పు..
సుదర్శన్‌గౌడ్: ఈరోజు సాయంత్రం పెట్టిస్తా..
శ్రీధర్ బాబు: ఈ రోజు సాయంత్రం పెట్టిస్తావా.. ఓకే
సుదర్శన్‌గౌడ్: ఒక పదికిలోలు తెప్పియ్యాల్నా సార్..
శ్రీధర్ బాబు: హా..
సుదర్శన్‌గౌడ్: నా ఫోన్ కాంటాక్ట్‌లో ఉండండి
శ్రీధర్ బాబు: ఏ టైమ్‌లో చేస్తావు అందాదా..
సుదర్శన్‌గౌడ్: ఈరోజు వినాయకచవితి కదా.. వాళ్ల కొట్టంలో పెట్టిస్తా
శ్రీధర్ బాబు: వాడి ఇంట్లో పెట్టిస్తావా.. లేక భూమిలోనా..
సుదర్శన్‌గౌడ్: వాడి ఇంట్లో కొట్టం ఉంటుంది.. కొట్టంలో పెట్టిస్తా.. సార్ నాకు కొంచెం.. కొంచెం..
శ్రీధర్‌బాబు: ఆ ఓకే అమ్మా.. ఓకే.. అని పెట్టేశారు. అయితే, ఈ ఆడియోటేపుల్లో ఉన్నది శ్రీధర్‌బాబు గొంతేనా అన్నది నిర్ధారించాల్సి ఉంది.