భారతీయ ప్రభుత్వ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది .దీనిలో భాగంగా ప్రభుత్వ టెలికాం దిగ్గజం అయిన బీఎస్ఎన్ఎల్ ఉచితంగా సిమ్ తో పాటు డేటాను అందిస్తూ రేపు సోమవారం నుండి దాదాపు ఐదు రోజుల పాటు ప్రత్యేక మెగా మేళాను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనుంది.
ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అనంతరామ్ వెల్లడించారు. ఈ మేళాలో భాగంగా, 3జీ స్మార్ట్ సిమ్ ను, 350 మెగాబైట్ల డేటాను ఫ్రీగా అందిస్తామని ఆయన తెలిపారు.
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 27వ తేదీ వరకూ మెగా మేళా జరుగుతుందని వెల్లడించారు. ఇదే సమయంలో ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లను కూడా కస్టమర్లు పొందవచ్చని ఆయన తెలిపారు. మరిన్ని వివరాల కోసం 18001801503 నంబరుకు కాల్ చేయాలని అన్నారు.