అలియా బట్ ఇటు అందాల ఆరబోతతో అటు నటనతో బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న వెరీ హాట్ హీరోయిన్ .ఇటీవల ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన గురించి పలు విషయాలను పంచుకుంది .ఈ సందర్భంగా అమ్మడు మాట్లాడుతూ “మూవీలలో నేను పోషించే ప్రతి పాత్ర నాకు అత్యంత గొప్పదే .ఒక మూవీ ఫెయిల్ అయిన హిట్ అయిన కామెంట్లు చేసేవారు వంద రకాలుగా కామెంట్లు చేస్తారు .
కానీ నేను అవన్నీ పట్టించుకోను .సినిమాలో నటిస్తే హిట్ అయిన కానీ ఫెయిల్ కానీ వచ్చే పేరును నేను పట్టించుకోను .నేను నటించే ప్రతిపాత్రను గుర్తు పెట్టుకుంటాను .ఎందుకంటే నేను ఆ పాత్ర కోసం ఎంతగానే కష్టపడతాను .అంతే కాదు మనస్సు పెట్టి మరి చేస్తాను .
నేను చేసే ప్రతి పాత్ర ప్రభావం ప్రతిఒక్కరి మీద పడాలని కోరుకుంటాను .అయితే ఎంత బాగా నటించాను అని ఐడియా లేదు కానీ ఏమి చేశాను అనేది మాత్రం నాకు తెలుసు .అట్లా కాకుండా ఎక్కడో వెనక కూర్చొని నా పనేదో నేను చేసుకుంటూ ఉంటె జీవితంలో చాలా కోల్పోయేదాన్ని ..నటన యావ నాకు చాలా ఎక్కువ అని అందుకే ఆసక్తితో ప్లోను బట్టి వెళ్ళేదాన్ని ఆమె వివరించారు .