ముఖ్యమంత్రి కేసీఆర్ పరకాలకు వరాలు ప్రకటించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పరకాల అభివృద్ధికి రూ. 50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విజ్ఞప్తి మేరకు పరకాలను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలను ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. వరంగల్‌కు మరిన్ని విద్యాసంస్థలు రాబోతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.