సినిమా ఇండస్ర్టీలో హీరోల రెమ్యునరేషన్ నిర్మాతల పాలిట పెద్ద తలనొప్పిగా మారింది. ఇక అగ్ర హీరోల రెమ్యునరేషన్ అయితే.. నిర్మాతలకు పెనుభారమే. సినిమా ఖర్చులో సగం ఖర్చు హీరోల రెమ్యునరేషన్‌కే పోతుందని నిర్మాతలు బాధపడుతున్నారు. ముఖ్యంగా రవితేజ రెమ్యునరేషన్ నిర్మాతలకు చిరాకు తెప్పిస్తోంది.
ప్రస్తుతం ఈయన క్రేజ్ పూర్తిగా పడిపోయిందని చెప్పాలి. గత కొంత కాలంగా సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో రవితేజా మార్కెట్ పూర్తిగా పడిపోయింది. పెట్టిన పెట్టుబడి రావడం కూడా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రవితేజా తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవడం లేదట. తాజాగా ఆయన నటించిన రాజా ది గ్రేట్ సినిమా రెమ్యునరేషన్ కారణంగానే సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఎలాగోలా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారనుకోండి. ప్రస్తుతం రవితేజ 8 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతున్నారట.కాస్త తగ్గించుకోండని నిర్మాతలు అడిగినా.. అస్సలు తగ్గడం లేదట. దీంతో వరుస హిట్‌లు అందుకున్న నాని సైతం రూ.5 కోట్లు తీసుకుంటుంటే…ఈయన మాత్రం 8 కోట్లు అడగడమేంటని మాట్లాడుకుంటున్నారు. రెండేళ్లు గ్యాప్ వచ్చినా కూడా ఈయనలో ఏ మార్పు రాలేదంటూ రవితేజ రెమ్యునరేషన్ గురించి నిర్మాతలు చర్చించుకుంటున్నారు.