అంకిత అప్పట్లో ఇటు తన అందంతో యువత మతిని పోగొట్టడమే కాకుండా అటు తన నటనతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అమ్మడు .మొదట్లో వరస అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది .ఇటు అందం అటు అభినయం ఉన్న హాట్ హీరోయిన్ గా ముద్రపడిన ఈ రస్నా గర్ల్ ఇప్పుడు మాయమైపోయింది .
తాజాగా ఒక ప్రముఖ పత్రిక “ఛాన్స్ దక్కాలంటే కమిట్ కావాల్సిందే అనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .ఆ కథనంలో అంకిత నిద్రమాత్రలు మింగింది అని ఒక వార్తను ప్రచురించింది .ఆ కథనం యదతదంగా “2004 చివరలో మారిషస్‌లో ‘మనసు మాట వినదు’ అనేచిత్రం షూటింగ్ జరుగుతోంది.యువహీరో నవదీప్, హాట్ బ్యూటీ అంకిత జంటగా నటిస్తున్నారు. అంతలోనే అంకిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు వార్తలు రావడం సంచలనం సృష్టించింది. అక్కడ నవదీప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ, తాను కోపంతో అతని చెంపపై కొట్టాననీ ఆరోపించారు అంకిత ఈ ముద్దుగుమ్మ .
ఇదంతా యూనిట్ సభ్యుల ముందే జరిగినా, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య సహా ఎవరూ తనకు మద్దతుగా రాలేదనే ఆవేదనతో ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి .ఈ ముద్దుగుమ్మ తల్లయితే ‘‘మారిషస్‌లో అడుగుపెట్టినప్పట్నించీ అంకితతో నవదీప్ అభ్యంతరకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆమెపై కామెంట్స్ చేస్తూ వచ్చాడు. పాటల చిత్రీకరణ సమయంలో ఆమెను ఇబ్బంది పెట్టాడు’’ అని ఆరోపించారు కూడా అప్పట్లో . అయితే వీటిని ఇటు నవదీప్, అటు ఆదిత్య.. ఇద్దరూ ఖండించారు. ఆ తర్వాత నవదీప్, అంకిత మధ్య రాజీ కుదరడంతో ఆ సినిమా షూటింగ్ కొనసాగింది అని వార్తలు వచ్చాయి అని ఆ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది .