తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలతో పాటుగా పలు సరికొత్త సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజారంజక పాలనను కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే .ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ ,టీడీపీ ,కాంగ్రెస్ ,విపక్ష రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు ,మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు ,మాజీ ఎంపీల దగ్గర నుండి ఎంపీల వరకు అందరు గులాబీ గూటికి వస్తోన్న విషయం విదితమే .
తాజాగా పోచంపల్లి మండలం జలాల్ పురం గ్రామంలో 60మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ లో చేరారు .వారికి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..అనంతరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ….తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పలు ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ,చేస్తోన్న అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు .