తెలంగాణ రాష్ర్టం లో ఏ పార్టీ నాయకులైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఆయన సంక్షేమ పథకాలను తప్పుబడుతున్నారో.. ఏ పార్టీ నాయకులైతే ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారో.. అదే పార్టీకి చెందిన రాజకీయ కురువృద్ధుడు, ఇప్పుడు రాహుల్ గాంధీకి రాజకీయ మార్గదర్శకుడిగా వ్యవహరించబోతున్న అపర చాణక్యుడు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కీర్తించారు. తన పుస్తకంలో.. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని వివరించారు.ద కొలిషన్ ఇయర్స్ (సంకీర్ణ సంవత్సరాలు) పేరుతో.. ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకాన్ని ఈ మధ్య మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విడుదల చేశారు. యూపీయే హయాంలో జరిగిన విషయాలను అందులో పూస గుచ్చినట్టు వివరించారు. కలిసి వచ్చిన పార్టీలు.. ఆ పార్టీల లక్ష్యాలను కూడా తెలిపారు. ఆ పార్టీలు ఎందుకు యూపీయేలో చేరాయి.. వారి ఉద్దేశాలేంటి… వారి లక్ష్యాలేంటి.. అభివృద్ధిలో ఆ పార్టీల భాగస్వామ్యం ఏంటన్నది కూడా వివరించారు.అందులో.. ఓ పేరాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి.. ప్రణబ్ ప్రస్తావించారు. తనకు ఏ పదవి ఇస్తారన్నది విషయం కాదని.. తెలంగాణ ఏర్పాటే తనకు ముఖ్యమని కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు ప్రణబ్ గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఒక్కటే తన లక్ష్యమని కేసీఆర్ చెప్పేవారని ప్రణబ్ స్పష్టంగా తన పుస్తకంలో రాసుకున్నారు. దీంతో.. తెలంగాణ సాధన కోసమే పుట్టిన మహానుభావుడు కేసీఆర్ అని మరోసారి స్పష్టమైపోయింది.
యూపీయే హయాంలో.. అప్పట్లో కేంద్ర కార్మిక మంత్రిగా చేసిన కేసీఆర్ ను.. పదవుల కోసమే యూపీయేలో చేరారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. వారి తోక పార్టీలు కూడా.. చీప్ కామెంట్లు చేశాయి. కానీ.. ఎలాంటి పదవిని అధిష్టించినా.. తన అంతిమ లక్ష్యం తెలంగాణ సాధనే అని.. తెలంగాణ ఏర్పాటు చేస్తారన్న నమ్మకంతోనే కేసీఆర్ యూపీయేలో చేరారని.. ప్రణబ్ ముఖర్జీ రాతలే స్పష్టం చేస్తున్నాయి.కానీ.. ఎప్పుడైతే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసిందో.. ఆత్హహత్యలకు కారణమైందో.. అప్పట్నుంచి కాంగ్రెస్ కు దూరంగా ఉండడమే కాదు. ఉద్యమాన్ని ఉరకలెత్తించి.. సబ్బండ వర్ణాలనూ పోరాటంలో భాగస్వామ్యం చేసిన ధీరోదాత్తుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పడు ముఖ్యమంత్రి పదవి కూడా.. కేవలం కుట్రలు అడ్డుకోవడానికి.. రాష్ట్ర ప్రజలను కాపాడుకోడానికే అన్న మాట కూడా.. నిరూపితమవుతోంది.ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర సాధనకు ఎంత తపించారో.. రాష్ట్ర అభివృద్ధికి కూడా కేసీఆర్ అంతే తపిస్తున్నారు. అందుకే.. ప్రజలు తమ మనసుల్లో చిరస్థాయిని కల్పించి.. కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నారు. కేసీఆర్ సంక్షేమాన్ని కాదని మరో పార్టీని కానీ.. మరో నాయకుడిని కానీ గెలిపించుకునేది లేదని తేల్చి చెబుతున్నారు.