కాలం చెల్లిన పార్టీ కాంగ్రెస్ అని.. గ్రూప్ తగాదాలతో నాయకత్వం లేని పార్టీగా అది మారిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటిస్తున్న మంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎవరిదారి వారిదేన్నారు. తెలంగాణలో టీడీపీకి స్థానం లేదన్నారు. కనుమరుగైన పార్టీ టీడీపీ అని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ బలోపేతానికి దోహదచేస్తుందన్నారు. కొడంగల్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహాకారం అందజేస్తదని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అనుచరులు, స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధులందరూ ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
