నివేదా థామస్ టాలీవుడ్ యంగ్ హీరో నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లోనే మొట్ట మొదటిసారిగా త్రిపాత్రభినయంలో నటించిగా బాబీ దర్శకత్వంలో జూనియర్ సోదరుడు ప్రముఖ హీరో కళ్యాణ రామ్ నిర్మాతగా వచ్చిన మూవీ జై లవకుశ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకుంది.
ఇటీవల నెటిజన్లు నివేదా పుట్టిన రోజు అని సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపించారు .దీనిపై ఈ ముద్దు గుమ్మ స్పందిస్తూ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతిఒక్కరికి కృతఙ్ఞతలు .అయితే నా పుట్టిన రోజు అక్టోబర్ 15న కాదు .
మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించి విషెస్ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు .ఎదో అనుకోకుండా అలా తప్పు జరిగిపోయింది అని అమ్మడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు .