ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కీలక నేత విద్యాసాగర్ రెడ్డి శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన విధ్యా సాగర్ రెడ్డి ఆయన తల్లి ధనమ్మ, భార‍్య, ఇద‍్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయలుదేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ‍్మ అక్కడికక్కడే మరణించగా, మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో రాయవేలూరు ఆస‍్పత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలానికి చేరుకుని కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
