సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర పాలనను గాలికొదిలేసి విదేశీ పర్యటనలంటూ బీజీగా గడుపుతున్నారని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన సొంత వ్యాపారాలను చక్కబెట్టుకునేందుకు.. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తానంటూ ప్రజలను మభ్యపెడుతూ.. ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తూ విదేశీ ప్రయాణాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ దేశం నుంచి ఎంత పెట్టుబడులు తెచ్చారో.. వచ్చాయో.. అన్న విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. ఉపాధిహామీ నిధులు టీడీపీ నేతలు దోచుకోవడానికి కాదని, చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించడం ఎంత వరకు సమంజసమన్నారు.
