తమిళ ‘బిగ్ బాస్’ నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయినా.. మంచి గుర్తింపుతో ఒవియా క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ బ్యూటీకి ఇప్పుడు తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో ఈ అమ్మడు దూసుకుపోతుంది.
అయితే, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒవియా తను పాటిస్పేట్ చేసిన బిగ్ బాగ్ షో గురించి మాట్లాడింది.
ఈ సందర్భంలోనే ఆరవ్ అనే మరో పార్టిసిపెంట్ గురించి చెప్పుకొచ్చింది ఒవియా. బిగ్ బాస్ గదిలోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఆరవ్‌పై వళ్లు మరిచిపోయేలా ప్రేమలో పడ్డానని, ఈ అమ్మడు ప్రేమ కోసం కొలనులో ముక్కు మూసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నం కూడా చేసిందట.
అంతేకాదు, అరవ్‌పై ప్రేమతో.. తను అతడి కోసం ఏం చేస్తానోనని భయపడిపోయిందట. బిగ్ బాస్ షోలో ఒకరిని మించి ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు ఎత్తులు వేస్తుంటారు. ఇలాంటి ఎత్తులన్నీ దాటుకుని చివరి దాకా వుండేవారే విన్నర్.
కానీ ఒవియా తమిళ బిగ్ బాస్ షోలో అందరి దృష్టిని ఆకర్షించింది కానీ తన దృష్టిని ఆకర్షించిన మగాడి దెబ్బకు తట్టుకోలేక షో నుంచి బయటకు వచ్చేశానని మీడియాకు చెప్పుకొచ్చింది.
